స్లాట్ బుకింగ్ చేసుకొని రద్దు పరుచుకున్న వారు డబ్బులు తిరిగి పొందే విషయంలో ఇచ్చే ఫోన్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలపై అప్రమత్తంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..2 తేదిః 30-09-2021
స్లాట్ బుకింగ్ చేసుకొని రద్దు పరుచుకున్న వారు డబ్బులు తిరిగి పొందే విషయంలో ఇచ్చే ఫోన్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలపై అప్రమత్తంగా ఉండాలి ::
జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 30: ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సమయంలొ ధరఖాస్తుదారుల బ్యాంకు అకౌంట్ వివరాలు, ఫోన్ నెంబర్లపై తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యు సంబంధింత వ్యవహారాలపై ఆర్డిఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని వివిధ కారణాల ద్వారా రద్దు పరుచుకునే సమయంలో ధరఖాస్తు దారుడు డబ్బు తిరిగి పొందే సమయంలో ధరఖాస్తుదారుని బ్యాంకు అకౌంట్, ఫోన్ నెంబర్ల వివరాలను కాకుండా మీసేవా నిర్వహాకులు వివరాలను నమోదు చేస్తున్నట్లు దృష్టికి వచ్చినందున, వాటిపై చర్యలు తీసుకునే సమయంలో ధరఖాస్తు దారుల బ్యాంకు అంకౌంటు, ఫోన్ నెంబర్లను గురించి దృవీకరించుకున్న తరువాతే చర్యలు తీసుకోవాలని. తహసీల్దార్ల వద్ద పెండింగ్ లో ఉన్న కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ దరఖాస్తులపై త్వరగా చర్యలు తీసుకోవాలని, గడువుదాటిన కుల, నివాస, ఆదాయ దృవీకరణ పత్రాల (బియాండ్ ఎస్ఎల్ఏ) జారిపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఎఫ్ లైన్ పిటీషన్లపై సాంకేతి సమస్యలను పరిష్కరించుకోవాలని, పెండింగ్ మ్యూటేషన్ లపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లొ ఉన్నవాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, భూసంబంధిత వ్యవహరాలపై వచ్చే పిటిషన్లపై, పిఓబి పెండింగ్ కేసులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సూచించారు. విరాసత్ కొరకు చనిపోయిన పట్టాదారు కుటుంబ సభ్యులు అందరు హజరై, మోకాపై ఉన్న సక్సెషన్ ఫైళ్లను పరిశీలించిన తరువాతే చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఈ ఆఫీస్ ద్వారా పైళ్లపై చర్యలు తీసుకోవాలని, ఈ ఆఫీస్ లాగిన్ సమస్యలను పరిష్కరించుకోవాలని, సిబ్బందికి ఈ ఆఫీస్ పై అవగాహన కల్పించాలని అదేశించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రవేశపెట్టిన గరుడ యాప్ పై అధికారులు బాగా పనిచేస్తున్నారని, బిఎల్ఓ లతో ఫోటోలను అప్ లోడ్ చేయాలని, ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ లు సత్వరంగా జరిగేలా చూడాలని, 7వ విడత వరకు భూములు మంజరుచేసి పట్టాలు ఇచ్చి, మోకా చూపించని వారికి, మోకా చూపించాలని అన్నారు. TsBpass లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని, బతుకమ్మ చీరల పంపిణి సక్రమంగా జరిగేలా చూడాలని, భారీవర్షాల వలన చర్యలు తీసుకునేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కోన్నారు.

స్లాట్ బుకింగ్ చేసుకొని రద్దు పరుచుకున్న వారు డబ్బులు తిరిగి పొందే విషయంలో ఇచ్చే ఫోన్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలపై అప్రమత్తంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చేజారిచేయనైనది.

Share This Post