జిల్లాలో కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం ముక్యంగా కేర్ ఇండియా స్వచ్చంద సంస్థ సేవలు అభినందనీయమమని ఆయన అన్నారు. మంగళ వారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పి.డి. ఐసీడీస్ జ్యోతి పద్మ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కతోనా నేపధ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో వివిధ స్వచ్చంద సంస్ధలు సేవలు వెలకట్టలేనివాని అన్నారు. ఈ సందర్బంగా కోవిడ్ బాధిత కుటుంభాలకు నిత్యవసర సరుకులు అందించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని బాధితకుటుంభాలకు స్వచ్చంద సంస్థలు అండగా నిలవాలని అలాగే
బాధిత కుటుంభాలకు నిత్యవసరాలతో పాటు ఉపాధి కల్పించడం మంచి పరిణామ౦ అని ఆయన అన్నారు.
కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న పలుకార్యక్రమలు ఆదర్శవంతమని అయిన తెలియజేసినారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి జ్యోతి పద్మ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ కోవిడ్ బాధిత కుటుంభాలను గుర్తించడం జరిగిందని అందులో ముగ్గురు పిల్లలు అనాధాలుగా, 168 మంది పిల్లలు పాక్షిక అనధాలుగా గుర్తించమన్నారు. వారిని ప్రభుత్వం తరుపున ఆన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేసినారు.
ఈ కార్యక్రమములో జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ B R రమణా రావు , BRB Coordinator వెంకటలక్ష్మి, DCPO B రవి కుమార్, కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అరుణ , M శ్రీనివాసులు పాల్గొన్నారు.


