స్వచ్చత రథ యాత్ర ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం —1
స్వచ్చత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, సెప్టెంబర్ 24
:-. స్వచ్చత ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం వద్ద స్వచ్చత రథ యాత్ర వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మాహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ – 2021 పేర జిల్లా అంతటా శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యం, శ్రమదానం కార్యక్రమాల పై ప్రజలలో అవగాహన కలిగిస్తూ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో తడి,పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన, మరుగుదొడ్ల వాడకం, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం, పంసిరాల పరిశుభ్రత, శ్రమదానం తదితర అంశాలపై ప్రజలలో చేతన్యం తేవడంతో పాటు శ్రమదానంలో పాల్గొని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుటలో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు. ఈ ప్రచార వాహనం ద్వారా రథ యాత్ర పెద్దపల్లి నుండి ప్రారంభమై కాసులపల్లి, ఖిలావనపర్తి ,దొంగతుర్తి, మేడారం, ధర్మారం గ్రామాలలో కళాకారుల బృందాలతో స్వచ్చ భారత్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టుచూ సాయంత్రం 6.00 గంటల కి తిరిగి పెద్దపల్లికి చేరుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీధర్ , జడ్పీ సీఈఒ శ్రీనివాస్, జిల్లా పంచాయతి అధికారి చంద్రమౌళీ, స్వచ్చ్ భారత్ మిషన్ అధికారి రాఘవులు, సంబంధిత అధికారులు, కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జారీచేయబడినది.

Share This Post