స్వచ్ఛతపై అవగాహన మరింత పెంచాలి…

ప్రచురణార్థం

స్వచ్ఛతపై అవగాహన మరింత పెంచాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 21.

స్వచ్ఛత కార్యక్రమాలపై ర్యాంకులు చేపడుతున్నందున గ్రామాలలో స్వచ్ఛత కార్యక్రమాలు మెరుగ్గా చేపట్టి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యాక్సినేషన్ నర్సరీ హరితహారం అవెన్యూ ప్లాంటేషన్ తడి పొడి చెత్త సేకరణ పై ప్రజలకు అవగాహన మరుగుదొడ్లు నిర్మాణాలు స్మశాన వాటికల వినియోగం
సెగ్రీ గేషన్ షెడ్స్ నిర్వహణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలుపై ఎంపీడీవోల తో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో స్వచ్ఛతపై మరింత దృష్టి పెట్టాలన్నారు చెత్త సేకరణ రోజువారీగా జరగాలని సూచించారు అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు తప్పనిసరిగా ట్రీ గార్డులు ఉండాలన్నారు. పల్లె ప్రకృతి వనాలను ప్రజలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

స్వచ్ఛత కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కొరకు ముగ్గుల పోటీలు పాఠశాలలో వ్యాసరచన పెయింటింగ్ వంటివి నిర్వహించాలన్నారు. ర్యాలీలు ఏర్పాటు చేయించాలని ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు ప్రతి రోజు ఒక కార్యక్రమం చేపట్టి నిత్యం ప్రజల్లో స్వచ్ఛంద కార్యక్రమం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యాసయ్య డి పి ఓ సాయిబాబా ఎంపీడీవోలు ఎంపీవోలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు
———————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post