స్వచ్ఛతా హి సేవా పక్షోత్సవాల్లో భాగస్వాములుకండి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

సెప్టెంబర్ 15, 2021ఆదిలాబాదు:-

ఆదర్శ గ్రామమైన ముక్రా – కే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం జిల్లాకే గర్వకారణం అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఇచ్చోడ మండలం ముక్రా – కే గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ – స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని, గ్రామపంచాయితీ కార్యాలయాన్ని పరిశీలించి, నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను కలెక్టర్, అదనపు  కలెక్టర్ లు ప్రారంభించారు. అనంతరం హరితవనాన్ని, సెగ్రిగేశన్ షేడ్ ను అందులో తయారుచేస్తున్న ఎరువుల తయారీని పరిశీలించారు. ఆ తరువాత కిచన్ గార్డెన్ ను పరిశీలించి, అంగన్వాడీ కేంద్రం లోని పిల్లలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లోని విద్యార్ధుల హాజరు శాతాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాల ను జిల్లాలోని అన్ని గ్రామాల్లో 15 సెప్టెంబర్ 2021 నుండి అక్టోబర్ 2, 2021 వరకు MPDO లు, MPO లు కార్యాచరణ రూపొందించి నిర్వహించాలని అన్నారు. గ్రామంలో అన్ని అభివృద్ధి పనులను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామం అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని అన్నారు. ఆదర్శ గ్రామమైన ముక్రా – కే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం జిల్లాకే గర్వకారణం అని అన్నారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ – స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవల్లో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు రోడ్లను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభవృద్ధి అధికారి కిషన్,  ఎంపిడిఓ రామ్ ప్రసాద్, తహశీల్దార్ అతికొద్దిన్, ఎంపీపీ ప్రితం రెడ్డి, సర్పంచ్ మీనాక్షి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

 

Share This Post