స్వచ్ఛత పై అవగాహన…..అదనపు కలెక్టర్ రాజర్షి షా

ఆజాది కా అమ్రిత్ మాహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ పేరిట స్వచ్ఛత పై అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) ఆద్వర్యంలో శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వచ్ఛా గ్రహ్ సత్యా గ్రహ్ పేర ఏర్పాటు చేసిన స్వచ్ఛ యాత్ర ప్రచార వాహనాన్ని ఆయన జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ యాత్ర ప్రచారం రథము ద్వారా జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తారని అన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ యాత్ర ప్రచార వాహనం ద్వారా తడి,పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన, మరుగుదొడ్ల వాడకం, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఏపీడిలు జయదేవ్, రాంబాబు, ఏ పీ ఎం వెంకట్, స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ స్వామి, మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post