ప్రచురణార్థం
స్వచ్ఛభారత్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్…
మహబూబాబాద్ అక్టోబర్ 2.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ రూపొందించిన ప్రచారం మొబైల్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శశాంక శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అలాగే స్వచ్ఛ భారత్ పై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచే దిశగా గ్రామాలలో ప్రజలకు తడి పొడి చెత్త పై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పై విస్తృత ప్రచారం కల్పించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్త పై అవగాహన పొందవలసిన ఆవశ్యకత ఉందన్నారు పారిశుధ్యం మెరుగు వలన సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పడతాయి అన్నారు.
అధికారుల్లో గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రజలు స్వచ్ఛభారత్ పాటించే విధంగా సిబ్బందితో అవగాహన చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ కొమురయ్య శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య డిఆర్డిఎ పిడి సన్యాసయ్యా తదితరులు పాల్గొన్నారు
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది