స్వచ్ఛ భారత్ పై ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

 

స్వచ్ఛ భారత్ పై ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ- 2021 లో భాగంగా భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ దేశమంతటా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రామాల్లో స్వచ్ఛతపై సాధించిన ప్రగతి పై పౌరుల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నన్నట్లు తెలిపారు.

జిల్లా ప్రజలు తమ ఐదు అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినట్లైతే స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

జిల్లాకు చెందిన ప్రతి పౌరుడు ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొని పారిశుధ్యంపై తమ అభిప్రాయాలను వ్యక్త పర్చాల్సిందిగా కలెక్టర్ సూచించారు.

ప్రతి ఒక్కరి వద్ద రెండు మొబైల్
నెంబర్లు ఉంటాయని, ఆ రెండింటి ద్వారా కూడా ఓటింగ్ లో పాల్గొని జిల్లాను స్వచ్ఛ గ్రామీణ గా ఎంపికయ్యే లా చూడాలని ఆయన కోరారు.
చైతన్యవంతంగా ప్రతి ఒక్కరూ ఓటింగులో పాల్గొనాలన్నారు. ఓటింగులో పాల్గొని http://ssg2021.in/Citizenfeedback పై క్లిక్ చేసి ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలన్నారు. జిల్లాను స్వచ్ఛ గ్రామీణలో ఉత్తమ జిల్లాగా ఎంపికయ్యేలా ఓటింగ్ చేయాలని ఆయన కోరారు.

Share This Post