స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సన్మానం

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సన్మానం

 అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కమిషనర్ వేణు మాధవ్ కు కేటీఆర్ హైదరాబాద్ లో సన్మానం

00000

     స్వచ్ఛ సర్వేక్షణ్-2022 జాతీయస్థాయిలో అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల కు వచ్చిన అవార్డు గ్రహీతలు అందరికీ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు శాలువాతో సన్మానం చేసి అవార్డును అందజేయడం జరిగింది.

     మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసిహెచ్ ఆర్డిఐ దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలోఅవార్డు గ్రహీతలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శాలువాతో సన్మానం చేసి తన చేతుల మీదుగా మెమెంటో లను అందజేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్-2022లో జాతీయస్థాయిలో అవార్డు వచ్చినందుకు అదనపు కలెక్టర్ అగర్వాల్, మన కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కమిషనర్ కట్ల వేణుమాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమేష్ కు శాలువాతో సన్మానం చేసి అవార్డు ప్రధానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో మన తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని, వచ్చే సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షన్ లో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని, ఎక్కువ మున్సిపాల్టీలకు అవార్డు రావాలని అన్నారు. మునిసిపాలిటీలలో కావలసిన శానిటేషన్ పనులకు, వైకుంఠ రథం, సానిటేషన్ కు సంబంధించిన యంత్రాల కొనుగోలుకు కావలసిన నిధుల విషయంలో గాని, మిగతా విషయాలలో ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు.

    ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిఎస్ అరవింద్ కుమార్, సెక్రెటరీ సుదర్శన్ , సిడిఎంఏ సత్యనారాయణ , అస్కి డైరెక్టర్ శ్రీనివాసచారి, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ కట్ల వేణుమాధవ్ , ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రమేష్ తదితరులు పాల్గోన్నారు…

Share This Post