స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో త్వరలో రాష్ట్రస్థాయి స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని తన చాంబర్ నుంచి గురువారం టెలీ కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లోని రోడ్లు, మురుగు కాలువలు శుభ్రంగా ఉండేవిధంగా మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోని కంపోస్టు షెడ్లలో తడి, పోడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, పాలకవర్గం సభ్యులు గ్రామస్థాయిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post