స్వచ్ఛ సర్వేక్షన్ కింద కోస్గి మున్సిపాలిటీకి జాతీయ స్థాయి గుర్తింపు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

స్వచ్చ్ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా  జాతీయ స్థాయిలో కోస్గి మున్సిపాలిటి కి గుర్తింపు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నేడొక ప్రకటనలో తెలిపారు.  ఈ గుర్తింపు రావడానికి ప్రధాన కారణం మున్సిపాలిటిలో  వినూత్నంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు షీ టాయిలెట్ అని తెలిపారు.  దీనికి తోడు మున్సిపాలిటీలో అధికారులు, పారిశుధ్య కార్మికుల శ్రమ, నిబద్ధత ఉందని కొనియాడారు.  స్వచ్ సర్వేక్షణ్ లో ప్రజలు అత్యధికంగా పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయడం కూడా ప్రధాన కారణమని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలు పారిశుధ్య కార్యక్రమంలో పోటీ పడి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో మరిన్ని గుర్తింపులు పొందాలని సూచించారు.

కొత్తగా ఎర్పైటైన నారాయణపేట జిల్లాలో మూడు నియోజకవర్గాలు, మూడు మున్సిపాలిటిలు, పదకొండు మండలాలతో  2019 ఫీబ్రవరి 17 నాడు జిల్లాగా ఏర్పాటు అయినదని,  అతిపురాతన మున్సిపాలిటిగా నారాయణపేటకు గుర్తింపు ఉందన్నారు. 23 వార్డు లతో ఉన్న నారాయణపేట  జిల్లా ఏర్పాటు కంటే ఒక్క సవత్సరం ముందు కోస్గిని 16 వార్డులుగా, మక్తల్   16 వార్డు లు గా విభజించి 02-08-2018 లో కొత్త మున్సిపాలిటీ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఏర్పాటు తరువాత కోస్గి మున్సిపాలిటి కి ప్రత్యెక చర్యలు చేపడుతు మున్సిపాలిటి లో వివిధ అభిరుద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని.  దేశంలోని సుమారు 4300 కు పైగా పట్టణాలు పాల్గొన్న ఈ పోటీలో ప్రధానంగా స్వచ్ఛ్ సర్వేక్షన్, చెత్త రహిత  పట్టణాలు,ఒడిఎఫ్, ODF  ప్లస్, ODF  ప్లస్ ప్లస్, వాటర్ ప్లస్, సిటిజెన్ ఫీడ్ బ్యాక్ అంశాలను ప్రధానంగా పరిగణలోనికి తీసుకోని విజేతలను నిర్ణయించినట్లు తెలిపారు.   విన్నూత్న ఆలోచనతో మొబైల్ షీ టాయిలెట్స్ (మహిళల కోసం బయోడిజాస్టర్ టాయిలెట్స్) ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగ పడుతూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు.  రాష్ట్ర క్రీడ, అబ్కారి సిని పరిశ్రమ శాఖామంత్రి షీ టాయిలెట్ ను ప్రారంభించారన్నారు.  పట్టణం లో మున్సిపాలిటి కార్మికుల ద్వరా రోజు తడి చెత్త పొడి చెత్త ను  సేకరించడం,  పట్టణం లోని వున్న అన్ని వార్డు లలో  ప్రతి ఇంటి నుండి వ్యక్తి గత మరుగుదొడ్లను వినియోగించుకోవడం, బహిరంగ మాల ముత్ర విసర్జన నిషేధం అమలు పరచడంలో పట్టణ ప్రజలు పూర్తి స్థాయి లో సహకరించడం జరిగిందన్నారు.  సింగిల్ యూజ్ ప్ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచడం  పట్టణం లో చెత్త కుండి రహిత పట్టణం గా ఏర్పాటు చేయడం.  ఈ నెల 20 వ తేదీన ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్టీంలోని ఇతర గుర్తింపు పొందిన మున్సిపాలిటీలతో పాటు కోస్గి మున్సిపాలిటికి  ఆహ్వానాలు అందాయని తెలిపారు.

Share This Post