స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కె.చంద్రరెడ్డి ఆదేశించారు

పత్రిక ప్రకటన

తేది:12-08-2021

నారాయణపేట జిల్లా

స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కె.చంద్రరెడ్డి ఆదేశించారు.  గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అందరూ జిల్లా అధికారులతో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ పై సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖాధికారులకు బాధ్యతలను అప్పగించారు.  కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ సారి పరైడ్ మైదానం  లో  జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు.  వైద్య శాఖ  కోవిడ్ -19 ను దృష్టి లో ఉంచుకొని శానిటైజర్ ,మాస్క్ లను ఏర్పాటు చేయాలని ,అలాగే ఓ అంబులెన్స్ ను   సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది  తమ వాహనాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మైదానం లో స్టాల్స్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. పథకవిష్కరణ ప్రాంతలను పరిశుభ్రం చేయడం,  ప్రముఖులకు ఆహ్వానం పంపించడం తదితర ఏర్పాట్లు జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ యస్పి భారత్ కుమార్ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణపేట జిల్లా  ద్వారా జారీ చేయడమైనది.

Share This Post