స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను పురస్కరించుకుని శనివారం ఖమ్మం నగరం జెడ్పి సెంటర్ నుండి 10వేల మందితో రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 13:

స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను పురస్కరించుకుని శనివారం ఖమ్మం నగరం జెడ్పి సెంటర్ నుండి 10వేల మందితో రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఈ నెల 8 నుండి రెండు వారాలపాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షల కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో ప్రగతి సాధించామన్నారు. స్వాతంత్ర్య చరిత్రను కొత్త తరాలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టుతున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోనే అతి పొడవైన జాతీయ జెండాతో భారీగా ర్యాలీ నిర్వహించామన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో పాలుపంచుకొనే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ర్యాలీని విజయవంతం చేసిన స్పూర్తితో ద్విసప్తాహ వేడుకలను దిగ్విజయం చేయాలని మంత్రి కోరారు.
పోలీస్ బ్యాండ్, లంబాడీ నృత్యాలు, కోలాటం, డప్పు కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ జెడ్పి సెంటర్ నుండి సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగింది. గుండెల నిండా జాతీయభావ స్ఫూర్తితో ర్యాలీ నడుస్తుండగా, దేశభక్తి, జాతీయ గీతాలు, నినాదాలతో పట్టణమంతా మార్మోగగా అన్ని వర్గాలవారు పెద్దఎత్తున ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో ర్యాలీలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మేయర్ పునుకొల్లు నీరజ, విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ లు స్నేహలత మొగిలి, మధుసూదన్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, విభిన్న వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post