స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ లో, సబ్ జైల్ లో జాతీయ సమైక్యత రక్షాబంధన్…..

స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ లో, సబ్ జైల్ లో జాతీయ సమైక్యత రక్షాబంధన్…..

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -12:

స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలక్టరేట్ కార్యాలయంలో, సబ్ జైల్ లో జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ కు వికలాంగులు, బాల సధనం పిల్లలు, గార్ల బంజారా సేవా సమితి విద్యాలయం పిల్లలు, ట్రాన్స్ జెండర్ లు పలువురు రాఖీలు కట్టారు. బయ్యారం, నెళ్ళికుదురు, కేసముద్రం, తాల్లపూసపల్లీ కు చెందిన వికలాంగులు కలక్టరేట్ కు రాగ వారికి చిన్నారులు రాఖీలు కట్టారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనురాగ బంధానికి, ఆత్మీయతకు ప్రతీక రాఖీ పండుగ అని ఈ రక్షాబంధన్ వేళ వయసుతో సంబంధం లేకుండా, కుల, మతాలు, బీద, గొప్ప అన్న బేధం లేకుండా సోదరులు చల్లగా ఉండాలనీ సోదరీమణులు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారని తెలిపారు.

ఉదయం డి.డబ్ల్యూ.ఓ., మునిసిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సబ్ జైల్ లో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో ఎమ్మేల్యే, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఫరీద్, మునిసిపల్ కమీషనర్ పాల్గొని సఖి, ఏ.ఎన్.ఎం., ఆశ వర్కర్స్, చిన్నారులచే ఖైదీలకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.

ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సి.డబ్ల్యూ.సి.చైర్ పర్సన్ నాగవాని, జిల్లా సంక్షేమ అధికారిని నర్మద, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, జిల్లా అధికారులు, డాక్టర్ పి. అశోక్, బ్రహ్మకుమారి నుండి సుజాత, శివరంజని, యుగెందర్, జైల్ సూపరింటెండెంట్, సి.డి.పి. ఓ లు డేబోరా, ఎల్లమ్మ, బాల సధనం సూపరింటెండెంట్ మంగతాయి, సఖి శ్రావణి, చిల్డ్రన్ ప్రొటెక్షన్ యూనిట్ వీరన్న, నరేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Share This Post