స్వతంత్ర భారత వజ్రిత్సవాల్లో భాగంగా రేపటి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ – పి. ఉదయ్ కుమార్

స్వతంత్ర భారత వజ్రిత్సవాల్లో భాగంగా రేపటి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో కోరారు. రేపు ఉదయం 11.30 గంటలకు జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు వ్యాపార సముదాయాలు ఉదయం 11.30 గంటలకు అందరూ లేచి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని తెలిపారు. వాహనదారులు అయితే ఆ సమయానికి ఎక్కడ ఉన్నా వాహనం పక్కకు ఆపేసి, వ్యాపార సముదాయాల వ్యాపారులు తమ వ్యాపార లావాదేవీలు ఆపేసి బయటికి వచ్చి సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొనాలని కోరారు.

Share This Post