స్వతంత్ర భారత వజ్రొత్సవాల్లో భాగంగా నేడు నారాయణపేట పట్టణ కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీనీ జిల్లా కలెక్టర్ హరిచందన గారు, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభించారు

స్వతంత్ర భారత వజ్రొత్సవాల్లో భాగంగా నేడు నారాయణపేట పట్టణ కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీనీ జిల్లా కలెక్టర్ హరిచందన గారు, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయం ముందు నుండి వీర్ సవర్కర్ చౌరస్తా నుండి మిని స్టేడియం వరకు ఫ్రీడం ర్యాలీ నిర్వహించి మినీ స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు ప్రతి భారతీయుడికి పండగ లాంటివని పేర్కొన్నారు ఈ దేశం మనది ఈ దేశం కోసం మేమంతా ఏకమవుతాం అని ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా చాటి చెప్పారని పౌరుల స్ఫూర్తిని కలెక్టర్ గారు కొనియాడారు. త్యాగదనుల పోరాటాలతో మనమంతా స్వేచ్ఛ స్వతంత్యాలు  అనుభవిస్తున్నామని వారి ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.  అనంతరం గాలిలోకి త్రివర్ణ పతాక రంగులతో కూడిన బెలూన్ల గాలిలోకి వదలడం జరిగింది. ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్న, అదనపు కలెక్టర్ పద్మజారాణి, DSP. సత్యనారాయణ, RDO. రాంచందర్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ,ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా అధికార యంత్రంగం, ప్రజాప్రతినిధులు,విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Share This Post