స్వతంత్ర భారత వజ్రొత్సవాలలో భాగంగా ఈ నెల 18న ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

స్వతంత్ర భారత వజ్రొత్సవాలలో భాగంగా ఈ నెల 18న ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

క్రీడా పోటీలను, ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, ఆగస్ట్ -17:

ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలను,ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా స్పోర్ట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి యువత, ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 16 మండలాల నుండి ఖో ఖో పోటీల్లో 12, కబడ్డీ 14, వాలీ బాల్ 14, టగ్ ఆఫ్ వార్ 14 మండలాల నుండి పాల్గొన్నారని, సెమీ ఫైనల్ 17న, ఫైనల్ పోటీలను 18న నిర్వహించాలని తెలిపారు. శాఖల వారీగా పాల్గొంటున్న ఉద్యోగుల, టీమ్ ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా, పురుష టీమ్ ల వారీగా పోటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 17న సెమీ ఫైనల్, 18 ఫైనల్ పోటీలు నిర్వహించాలని, 18న సాయంత్రం ఎన్.టి.ఆర్. స్టేడియం లో క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు, శానిటేషన్, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, క్రీడాకారులకు స్నాక్స్, గెలుపొందిన విజేతలకు అందించటానికి ప్రశంసా పత్రాలను, మెమొంటో లను, స్టేజ్ తయారీ,తదితర ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డి.ఈ. ఓ. ఎం.డి.అబ్దుల్ హై, డి.హెచ్.ఎస్. ఓ. సూర్యనారాయణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి. సుధాకర్, డి.వై.ఎస్. ఓ. అనిల్, ఆర్డీవోలు కొమురయ్య, ఎల్.రమేష్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్దార్ నాగభవాని, తదితరులు పాల్గొన్నారు.

Share This Post