స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి…..రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి…..రాష్ట్ర అటవీ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -17:

స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

బుధవారం మంత్రి అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలక్టరేట్ లోని ప్రజ్ఞా వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 21న ప్రత్యేక సమావేశాలకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 8వ విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ, జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమం కింద 69.58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 44 లక్షలు నాటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నాటిన మరో 7 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉందని, సెప్టెంబర్ మొదటి వారం నాటికి 8వ విడత మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఆగస్టు 10న వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లాలో మొక్కలు నాటామని, ఆగస్టు 21న జిల్లా వ్యాప్తంగా 461 పంచాయతీలు, 82 మున్సిపల్ వార్డులలో 1 లక్ష మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని ఉదయం 8 గంటలకు ప్రజా ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం ప్రారంభిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆగస్టు 21న కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించి, అనువైన స్థలాలను గుర్తించామని, గుంతల తవ్వకం ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో జెడ్పీ సి.ఈ. ఓ. రమాదేవి, డి.హెచ్.ఎస్. ఓ. సూర్యనారాయణ, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి.ఓ. సాయిబాబా, మునిసిపల్ కమిషనర్ ప్రసన్నా రాణి, ఎఫ్.ఆర్.ఓ.లు ఏ.కరుణాకర్ చారి జ్యోత్స్న దేవి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post