స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి -జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో నాగర్ కర్నూల్ జిల్లాలో ఆగష్టు 8 నుండి ద్విసప్తాహం పాటు నిర్వహించనున్న కార్యక్రమాల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ ఆగస్టు 8 నుండి ప్రారంభం కానున్న స్వత్రంత్ర భారత వజ్రోత్సవాలు రోజుకో కార్యక్రమం చొప్పున ఆగస్టు 22 వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి పతాకాలా పంపిణీ, సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం, ఫ్రీడమ్ రన్, ముగ్గుల పోటీలు వంటివి నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. స్వాతంత్య్ర దినోత్సవమును పురస్కరించుకుని ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయించాలని, ఈ ద్విసప్తాహం జిల్లాలో పండగ వాతావరణం కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, అదనపు ఎస్పీ రామేశ్వర్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post