స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి…..జిల్లా కలెక్టర్, ఎస్పీ.

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి…..జిల్లా కలెక్టర్, ఎస్పీ.

ప్రచురణార్థం

ఈ నెల 11న ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి
13న నిర్వహించు ర్యాలీ, 16న నిర్వహించు సామూహిక జాతీయ గీతాలాపన లో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి

ఈ నెల 14న సాయంత్రం జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ

మహబూబాబాద్, ఆగస్ట్ -10:

స్వతంత్ర భారత వజ్రొత్సవాలలో కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని, ఈ నెల 11న చేపట్టనున్న ఫ్రీడం రన్ లో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు సంయుక్తంగా తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా వివరాలు తెలుపుతూ, వజ్రోత్సవ ఏర్పాట్లపై ముందస్తుగా కమిటీ సమావేశమై, జాతీయత పెంపొందెలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రివర్యులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు ప్రజలు పాల్గొన్నారని, జిల్లాలోని 419 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే 48 వేల 734 మంది విద్యార్థిని, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా చూపెట్టే విధంగా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు మంత్రి విద్యార్థిని, విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని వీక్షించారు అని తెలిపారు.

9 నుండి జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి అందిస్తున్నామని, 12 లోగా అన్ని ఇళ్లకు అందిస్తామని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జెండాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పాల్గొన్నారని తెలిపారు.

ఈనెల 11 నుండి 21 వరకు నిర్వహించు కార్యక్రమాల్లో ప్రజలు అత్యధికంగా పాల్గొనాలని, 11న స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియం నుండి ఉదయం 6-30 గంటలకు ఫ్రీడమ్ రన్ మొదలవుతుందని, అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, 12న జాతీయ సమైక్యత రక్షా బంధన్ కార్యక్రమం, చిన్న నిడివి గల దేశభక్తి చిత్రాలను కేబుల్ ఛానల్ లలో ప్రసారం చేయనున్నట్లు, అలాగే 13 న నిర్వహించు ర్యాలీలో పాల్గొనాలని, 14న సాయంత్రం జానపద కళాకారులచే, సాంస్కృతిక సారథి కళాకారులచే స్థానిక యశోద గార్డెన్స్ లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 15న స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియం లో ఉదయం మంత్రిచే పతాకావిష్కరణ కార్యక్రమం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

16 న తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అన్ని గ్రామ పంచాయతీల్లో, మునిసిపాలిటీ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు, 17న బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు నిర్వహించనున్నట్లు, జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో, మరిపెడ, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

యువకులకు, ఉద్యోగస్తులకు ఈ నెల 11 నుండి 13 వరకు గ్రామ స్థాయిలో, 14 నుండి 16 వరకు మండల స్థాయిలో, 17, 18 న జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు, ఫైనల్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

19న ఆసుపత్రుల్లో, వృథాశ్రమాల్లో, అనాధశ్రమాల్లో, జైళ్లలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయు కార్యక్రమం చేయనున్నట్లు, 20న స్వయం సహాయక సంఘ మహిళలచే రంగోలి కార్యక్రమం, 21న ప్రత్యేక సమావేశాలు నిర్వహించు కుంటామని తెలిపారు.

అన్ని కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగస్తులు, మీడియా ప్రతినిధులు, అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.సుధాకర్ పాల్గొన్నారు.

Share This Post