స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జరుగుచున్న రోజుకో కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జరుగుచున్న రోజుకో కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో కోరారు. కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9.00 గంటలకు జిల్లా పరిషత్ మైదానం నుండి ర్యాలీగా ట్యాన్క్ బండ్ వరకు నుర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ మైదానం లో హాజరై ర్యాలీగా ట్యాన్క్ బండ్ చేరుకుంటుందన్నారు.
14వ తేదీన జడ్పి మైదానంలో మధ్యాహ్నం 3 గంటల నుండి జానపద కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆ రోజు జానపద కళాకారుల ప్రదర్శన అనంతరం అక్కడే బాణాసంచా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం కంటే గొప్పగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఆ రోజు ప్రతి ఇంటి పై మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేసి ప్రతి ఒక్కరూ సంబరం చేసుకోవాలని కోరారు.
16వ తేదీన జరిగే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్యాక్రమం ఎంతో ప్రత్యేకమైనదని ఉదయం 11.30 గంటలకు జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి పాఠశాల, ప్రతి ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాలు, జైలు, బస్టాండ్ ప్రతి చోట జాతీయ గీతాలాపన లో పాల్గొనాలని తెలిపారు. ఉదయం 11.30 గంటలకు నాగర్ కర్నూల్ అంబెడ్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి సామూహిక గీతాలాపన చేయడం జరుగుతుందన్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సంబురాలు చేసుకోవాలని కోరారు.

Share This Post