స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జరిగిన జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్ , ముఖ్య అతిథిగా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి గారు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రకాల కళా రంగాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జరిగిన జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ జానపద కళాకారుల ప్రదర్శనలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కు సంబంధించిన 18 పాఠశాలల విద్యార్థులు పాల్గొని దేశభక్తి, జానపద పాటల పై నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైన కళలకు ప్రాధాన్యత ఇచ్చి కళాకారులను ఆదరించడం జరుగుతుందన్నారు. ఈ రోజు జరిగిన కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయనని, ప్రతి పాఠశాల విద్యార్థులు ఎంతో చక్కగ తమ కళాప్రదర్శన్ చేసారని కొనియాడారు. రేపటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా జిలా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంత తక్కువ సమయంలో అభ్యసన చేసి చాలా బాగా తమ కళా సమర్త్యాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు. రేపటి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలల విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మెమోంటోలను బహుకరించారు.
అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా పౌర సంబంధాల అధికారి, పి. సీతారాం, జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఆర్డీఓ నాగలక్ష్మి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post