స్వతంత్ర భారత వజ్రోత్సవాలు..
జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరంను
ప్రారంభించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిరిసిల్ల లో మిషన్ భగీరథ ఉద్యోగులు 47 మంది, పోలీస్ శాఖ చెందిన 25 మంది సహా 80 మంది రక్తదానం చేశారు.
సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు.రక్తదానం ప్రాణ దానంతో సమానమని ఆమె పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరం కు మంచి స్పందన లభించిందనీ అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని అన్నారు.
అనంతరం రక్తదాత లకు అతిథులు పండ్లు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కు కృషి చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళి ధర్ రావు, నోడల్ అధికారి శ్రీనివాస్ లను జిల్లా కలెక్టర్ అభినందించారు.