స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నేలంతా పులకరించేలా మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు

ఈనెల 21న తెలంగాణ నేలంతా పులకరించేల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

 

ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనాలి

 

రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

 

 

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నేలంతా పులకరించేలా మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ పై    అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 21,2022 న  రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 8వ విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ  జిల్లాలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి ఆన్నారు.  తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో   రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 264 కోట్లకు పైగా మొక్కలు నాటామని, ఎనిమిదవ విడత అధికారంలో19.54 లక్షల కాలనీ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్ష్యానికి మరింత చేరువ అవుతామని  అన్నారు సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో పని చేయడం వలన రాష్ట్రంలో పచ్చదనం శాతం 7.7 వృద్దిచెందిదని మంత్రి పేర్కొన్నారు.  ఆగస్టు 21, 2022న ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు లో మొక్కలు నాటాలని, అందుకు అవసరమైన  మొక్కలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో నాటిన మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ పథకం కింద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

 

అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ ఎనిమిదవ విడత హరితహారం లో రాష్ట్ర వ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటి వరకు మూడంతుల పనులు పూర్తి చేసామని తెలిపారు. ఆగస్టు 21న అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆమె సూచించారు.

 

ఈ సందర్బంగా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ కాలనీతో పాటు  జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో  ఈనెల 21వ తేది లోగా 5 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి పూర్తిచేయడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు గాను ముందుగానే జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రికి  తెలిపారు.

 

ఈ సమావేశంలో జిల్లా ఆనపు కలెక్టర్ పద్మజా రాణి, ఫారెస్ట్ అధికారి వీణవాని, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి గోపాల్ నాయక్, మున్సిపల్ కమీషన్ సునీత, , డిపిఓ మురళి ఇతర జిల్లా అధికారులు పాల్గోన్నారు.

Share This Post