స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ఈ నెల 11 నుండి గ్రామ స్థాయి నుండి ప్రారంభమైన వజ్రోత్సవ క్రీడలు చివరి రోజు నేడు అట్టహాసంగా జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ఈ నెల 11 నుండి గ్రామ స్థాయి నుండి  ప్రారంభమైన వజ్రోత్సవ క్రీడలు చివరి రోజు నేడు అట్టహాసంగా జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. వజ్రోత్సవ క్రీడలకు చివరి రోజైన గురువారం   ఫ్రీడం క్రీడలు జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా గత 10 రోజుల నుండి అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అందులో భాగంగానే ఈ రోజు జిల్లా కేంద్రం లో ఖోక్కో, కబడ్డి,వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, లాంగ్ జంప్, రన్నింగ్ వంటి  క్రీడలను జిల్లా స్థాయి ఉద్యోగులకు నిర్వహించారు.  క్రేడలు ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమని  తమ ఆరోగ్యానికి,  శారీరకంగా కూడా బలంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుత్గున్న క్రీడలలో భారత దేశం  అనేక పతకాలను సంపాదిస్తున్నారన్నారు.  జిల్లా కేంద్రం లోని మినిస్తేడియం లో జరుగుతోన్న క్రీడలకు జిల్లా కలెక్టర్ డి హరిచందన జెడ్పి చైర్మన్ వనజమ్మ తో కలిసి ప్రారంభించారు. మహిళా పోలిస్ వ్యయమ ఉపాద్యాయుల మద్య ఖోఖో పోటిని జిల్లా కలెక్టర్ టాస్ ఎగురవేసి ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది వర్సెస్ పోలిస్ ల మద్య కబడ్డీ ని జిల్లా చైర్పర్సన్ మున్సిపల్ సిబ్బంది తరపున రైడింగ్ చేసి కబడ్డీ ఆటను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలో   అదనపు కలెక్టర్ పద్మజ రాణి, జిల్లా అధికారులు డాక్టర్ రామమనోహర్ రావు, శివప్రసాద్, హతిరం, CI శ్రీకాంత్, అర్దిఒ రామచందర్ నాయక్, సాయినాథ్, వ్యయమ ఉపాద్యాయులు, పోలీస్ సిబంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post