స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన హరితహారంలో భాగంగా అన్ని చోట్లా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ కోరారు.

*స్వతంత్ర భారత  వజ్రోత్సవాల సందర్భంగా అన్నిచోట్లా మొక్కలు నాటే కార్యక్రమం, ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు*

*తెలంగాణకు హరితహారం లక్ష్యాలను అన్ని శాఖలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి*

*గృహాలకు పంపిణీ చేసిన మొక్కలు తప్పనిసరిగా నాటేలా చర్యలు తీసుకోవాలి*

 

—— హరితహారంపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ &  హెచ్ఓఓఎఫ్.

వీడియో కాన్ఫరెన్స్….

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన హరితహారంలో భాగంగా అన్ని చోట్లా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ కోరారు. తెలంగాణకు హరితహారం ఎనిమిదవ విడత పురోగతిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లాల వారీగా హరితహారం టార్గెట్లు, ఇప్పటిదాకా సాధించిన ప్రగతిపై ఆరా తీశారు. భారీ వర్షాల వల్ల మొక్కలు నాటే కార్యక్రమానికి అంతరాయం జరగిన చోట్ల, ప్రణాళికలు  రీ షెడ్యూల్ చేసి హరితహారం కొనసాగించాలని కోరారు. హరితహారంపై అన్ని శాఖల సమన్యయం చేస్తున్న అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని కోరారు. కొన్ని జిల్లాల్లో మొక్కల పంపిణీని పెద్ద సంఖ్యలో చూపుతున్నారని, కానీ గృహాలకు పంపిణీ చేసిన మొక్కలు తప్పనిసరిగా నాటేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

*సమావేశంలో చర్చించిన ఇతర అంశాలు* ;

ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడమ్ ప్లాంటేషన్స్ పెద్ద ఎత్తున నిర్వహణ.

జిల్లాల వారీగా హరితహారం లక్ష్యాల సాధన, శాఖల సమన్యయం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు చూడాలి.

ప్రతీ గ్రామ పంచాయితీ నర్సరీల్లో తప్పనిసరిగా కనీసం వెయ్యి నుంచి ఐదు వేల పెద్ద మొక్కల పెంపకం.

జిల్లాకు కనీసం నాలుగు సెంట్రల్ నర్సరీల ప్రారంభించి, పెద్ద మొక్కల పెంపకం.

హరితహారం కోసం మొక్కలు బయట నుంచి కొనుగోలు చేయకుండా, ప్రభుత్వ నర్సరీల్లోనే పెంపకం.

మళ్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ మరింత చిక్కగా ఉండేలా అన్ని చోట్లా గ్యాప్ ప్లాంటేషన్.

హరితహారం మొక్కల పర్యవేక్షణ కోసం వాచ్ అండ్ వార్డ్ తప్పనిసరిగా ఏర్పాటు.

పట్టణ ప్రాంతాల్లో మరింత చిక్కటి పచ్చదనం కోసం మున్సిపల్ కమిషన్లు చొరవ తీసుకోవాలి.

వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషన్లు, పంచాయితీ రాజ్ పీడీలు, జిల్లా ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులతో పాటు పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ ఏ.కే. సిన్హా, డీసీఎఫ్ శాంతారాం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

 

Share This Post