స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -06:

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శనివారం కలక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత జిల్లా అధికారులు, పాఠశాలల ప్రధాన ఉపాద్యాయులు,ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ సంబరాలు ఈ నెల 8 నుండి 22 వరకు విజయవంతంగా నిర్వహించాలని, 75 వసంతాల స్వాతంత్య్రాన్ని ఈ 15న నిర్వహించుకుంటున్న సందర్భంలో రెండు వారాల పాటు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సమాంతరంగా విద్యా శాఖ తరపు నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8 నుండి 22 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రోజువారి షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, దానికి తగినట్లుగా కార్యక్రమాలు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన సుమారు 50 వేల మంది 6 వ తరగతి నుండి 10వ తరగతి పిల్లలకు 9వ తేదీ నుండి పాఠశాలకు దగ్గరలో గల నిర్దేశించిన సినిమా హాలులో ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ప్రతి రోజు 4 వేల 335 మంది పిల్లలు గాంధీ సినిమా చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని, అలాగే క్రీడా పోటీలు పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించాలని తెలిపారు.

ఈ నెల 9 నుండి సినిమా హాలుకు పిల్లలను తీసుకెళ్లే సమయంలో ప్రతి 15 మంది పిల్లలకు ఒక టీచర్ తో పాటు బస్సులో మండల స్థాయి అధికారి ఉండే విధంగా చూడాలని, ప్రతి విద్యార్ధి తన వెంట వాటర్ బాటిల్ తీసుకొని వచ్చే విధంగా చూడాలని, థియేటర్ లలో కూడా మినరల్ వాటర్ ఏర్పాటు చేయించాలని, థియేటర్ వద్ద డెప్యూటీ తహసిల్దార్ స్థాయి అధికారిని ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు, పోలీసు సిబ్బందిని కేటాయించి పర్యవేక్షణ చేయాలని, పిల్లలు చూసే థియేటర్లలో భద్రతా ప్రమాణాలను రెండు రోజుల్లోగా ఆర్డిఓలు, డి.ఎస్.పి., ఫైర్ అధికారితో కలిసి తనిఖీ చేయాలని, సీటింగ్ కెపాసిటి చూడాలని తెలిపారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సినిమా చూసి వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పిల్లలకు అల్పాహారం అందించేలా ఎస్.ఎం.సి చైర్మన్లు, సర్పంచులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, సినిమా చూసే సందర్భంలో బయటి తినుబండారాలను తినకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. జిల్లా రవాణాధికారి పిల్లల సౌకర్యార్ధం బస్సులను ఏర్పాటు చేయాలని, పాఠశాలల ప్రధాన ఉపాద్యాయులు కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించనున్న కార్యక్రమాలు వివరాలు తెలుపుతూ, ఈ నెల 8న ప్రారంభ కార్యక్రమం, 10న దేశభక్తి గీతాలపై పాటల పోటీలు, వజ్రోత్సవ వన మహోత్సవం, 11న వ్యాస రచన పోటీలు, 12న పాఠశాల స్థాయి ఆటల పోటీలు (ఫ్రీడమ్ కప్), 15న ప్రభాత భేరి, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణ పోటీలు, జాతీయ పతాకావిష్కరణ, స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సమావేశం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 16న ఉపన్యాస పోటీలు, సామూహిక జాతీయ గీతాలాపన, 17న చిత్రలేఖనం పోటీలు, 18న జాతీయ భావం ఉట్టిపడేలా ఏకపాత్రభినయ పోటీలు, మండల స్థాయిలో ఆటల పోటీలు (ఫ్రీడమ్ కప్), 19న జాతీయ భావం ఉట్టిపడేలా ముగ్గుల పోటీలు, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన ఉపాధ్యాయులకు కవితా రచనా పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహణ, 22న ముగింపు సమావేశం, పాఠశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణ అధికారి, ఆర్డీవోలు, ఇంటర్ మీడియెట్ జిల్లా శాఖాధికారి ఎస్. సత్యనారాయణ, జెడ్పీ సి.ఈ. ఓ. రమాదేవి, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, డి.పి. ఓ. సాయిబాబా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, సంక్షేమ అధికారులు, ఆర్.సి. ఓలు, ఎం.ఈ.ఓలు, ఎస్. ఓలు, ఎస్.జి.ఎఫ్. ఐ. సెక్రెటరీ, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post