స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హార్ ఘర్ తీరంగా అనే కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో  ప్రజలందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు హార్ ఘర్ తీరంగా అనే కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.  మంగళవారం ఉదయం స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి తో కలిసి  స్థానిక 8వ  సత్య సాయి కలోని లో జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేశారు.  ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి చాటుకోవడమే కాకుండా ప్రతి వ్యక్తిలో జాతీయ భావం పెంపొందించే విధంగా జిల్లాలోని ప్రతి ఇంటికీ ఒక జాతీయ జెండాను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.  ఈ మూడు రోజుల పాటు జెండా ఎగురవేయడంలో ప్రభుత్వం కొంత వేసులుబాటును కల్పించిందన్నారు.   నిబంధన ప్రకారం అయితే ఉదయం ఎగురవేసిన జాతీయ జెండాను సూర్యాస్తమం లోపు తీసేయాల్సి ఉంటుందన్నారు.  కానీ ఈ వేడుకలకు వెసులుబాటు కల్పిస్తూ ఇళ్లపై 13వ తేదీన ఎగుర వేసిన జాతీయ పతాకాన్ని 15  వరకు ఉంచి ఆ రోజు సాయంత్రం తీయాల్సి ఉంటుందన్నారు.  అదేవిధంగా జాతీయ పతాకం ఎక్కడ అవమాన పదేవిధంగా చేయకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయకుండ జాగ్రత్తలు తీసుకొని సరిగ్గా ఎగురవేయడం, కింద  పడకుండా చూసుకోవడం, చిరిగిన జెండాను  ఎగురవేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.  మండలాల్లో, గ్రామాల్లో అధికారులు ఈ విషయంలో ప్రజలకు తగిన అవగాహన కల్పించడమే కాకుండా ఎక్కడా పొరపాట్లు జరుగకుండా కిందిస్థాయి ఉద్యోగులు తగిన జాగ్రత్తలు  తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి సరిపడా జాతీయ జెండాలు జిల్లాకు వచ్చాయని, మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ పాతాజాన్ని ఎగురవేసి మహా పండగ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పథకం అంటే స్వాతంత్రానికి గుర్తుచేసేదే జాతీయ పథకం స్వతంత్ర వచిందంటే ఎంతో మంది సమారా యోదుల ప్రాణాలు త్యగాలుచేసినందుకు మనం స్వతంత్రంగా బఠాకగాల్గుతున్నమన్నారు. ఈ 15రోజులు తెలంగాణా ప్రభుత్వమ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జర్పుకుంటుందో మేమలన్దరిని భాగస్వాములు కావాలని  ప్రస్తుత తరానికి తెలియాలని ఎంతోమంది పిల్లలకు అహింస మార్గం అనేది తెలియాలని రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ఉచితంగా చిత్ర ని చూపించడం జరుగుతోందన్నారు. తల్లి దండ్రుల లే మొదటి గురువులని స్వతంత్ర సమరయోదుల గురించి తమ పిల్లలకు తెలియజేయాల్సిన భాత్యత ఎంతైనా ఉందన్నారు. భారత దేశ సంస్కృతి దేశ గొప్ప తనం దాదాపు 150సవత్సరాల పోరాట ప్రతిఫలమే స్వతంత్రం వచిందన్న విషయాన్ని పిల్లలకు తెలపాలని సూచించారు. మన నాయకుల త్యాగాలను వరికి తెలియచేపలన్నారు. ప్రతి ఇంటికి ఒక్కటి జండాను అందించడం జరుగుతోందన్నారు. 22వ తేది వరకు ప్రతిరోజు ఓ కార్యక్రంలలో భాగాసములై వజ్రోత్సవాలలో భాగమం కావాలని పిలుపునిచారు.

జిల్లా యస్పి యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ

15 రోజుల పటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరు భాగమై ప్రతిఉరు వడ లలో జరుపోకోవడం జరుగుతోందని జాతీయ జండాను గౌరవించడం మన ధర్మమని ప్రతి ఒక్కరు బాగా స్వాములు కావాలన్నారు.

అనతరం జాతీయ జండాను పంపిణి చేశారు.

పంపిణి కార్యక్రమం కంటే ముందు జిల్లా కేంద్రం లోని మనోహర్ థియేటర్ లో విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమం లో  అదనపు కలెక్టర్ పద్మజా రాణి, ఆర్డీఓ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్మన్ గాంధేఅనసుయ్య చంద్రకాంత్, వార్డ్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post