స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ద్విసప్తాహ రోజువారీ కార్యక్రమాలు విజవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ద్విసప్తాహ రోజువారీ కార్యక్రమాలు విజవంతంగా  నిర్వహించేందుకు పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ద్విసప్తాహ రోజు వారీ కార్యక్రమాల నిర్వహణ పై రాష్ట్ర డి.జి.పి మహేందర్ రెడ్డి, ఇతర కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.  ఈనెల 11న జరిగే ఫ్రీడమ్ రన్, 13న జరిగే ర్యాలీ, 16న జరిగే  సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని ఆదేశించారు.   ప్రతి గ్రామ పంచాయతీ, మండలం, మున్సిపాలిటీల్లో ర్యాలీ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలన్నారు.  13వ తేదీన జరిగే ఫ్రీడమ్ రన్ ఉదయాన్నే 6.30 గంటలకు  అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రారంభమయ్యేవిధంగా   పోలీస్ శాఖ తరపున ప్రతి జి.పి కి మండలానికి, మున్సిపాలిటీలో పోలీస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నారు.  16వ తేదీన ఉదయం 11 గంటలకు అన్ని గ్రామ పంచాయతీల్లో, మండలాల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో, అన్ని ప్రధాన కూడళ్లలో ఒకేసారి జాతీయ గీతాలాపన జరిగే విధంగా పకడ్బందీగా చర్యాలు తీసుకోవాలని సూచించారు.  ప్రధాన కూడళ్లలో మైక్ ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ పూర్తిగా స్తంభింప చేసి ఎవరు కదలకుండా, హారన్లు కొట్టకుండా సామూహికంగా జాతీయ గీతాలాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  11 గంటలకు అన్ని వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు ప్రతి ఒక్కరూ జాతీయ గీతాలాపన చేసేవిధంగా అవగాహన కల్పించి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  18వ తేదీన జరిగే ఫ్రీడమ్ కప్ విజయవంతం చేసేందుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్  వంటి క్రీడలను  11, 12 తేదీల్లో గ్రామ స్థాయిలో  అక్కడ గెలుపొందిన వారికి   13, 14 తేదీల్లో మండల స్థాయిలో , మండల స్థాయి విజేతలకు 15,16,17 జిల్లా స్థాయిలో నిర్వహించి 18వ తేదీన ఫ్రీడమ్ కప్ ఫైనల్ నిర్వహించాలని తెలియజేసారు.  రేపటి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అన్ని ఫ్రీడం పార్కులలో ప్రతిచోటా 75 మొక్కలకు తగ్గకుండా నాటాలని ఆదేశించారు.  ప్రతిరోజు కార్యక్రమ పూర్తి అయ్యాక  పూర్తి నివేదిక సాయంత్రానికి పంపించాలని ఆదేశించారు.  విద్యార్థులకు నేటి నుండి చూపిస్తున్న గాంధీ సినిమా వివరాలు సైతం రోజువారీగా జిల్లాలో ఏన్నీ థియేటర్లలో ప్రదర్శించారు, ఎంతమంది విద్యార్థులు వీక్షించారు అనే వివరాల నివేదిక పంపించాలని సూచించారు.  ప్రతి ఇంటికి జాతీయ పతాకాలు అందేవిధంగా అదేవిధంగా ప్రతి ఇంటి పై ఎగురవేసి ప్రజలు వజ్రోత్సవాల్లో భాగస్వాములు అయ్యేవిధంగా చూడాలని కలెక్టర్ లను ఆదేశించారు. ప్రతి వ్యక్తి లో జాతీయతా భావం పెంపొందించే విధంగా, ఎన్నో త్యాగాలు చేసి ఆంగ్లేయుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేయించిన మహనీయులను స్మరించుకునే విధంగా ఈ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించడం  జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న డిజి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ర్యాలీ, ఫ్రీడమ్ రన్, సామూహిక జాతీయ గీతాలాపన, ఫ్రీడమ్ కప్ కార్యక్రమాలకు  పోలీస్ శాఖ తరపున పూర్రి బాధ్యతలు తీసుకొని జిల్లా యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ డి హరిచందన  మాట్లాడుతూ నారాయణపేట  జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి జంక్షన్లో ర్యాలీలు, ఫ్రీడమ్ రన్, సామూహిక జాతీయ గీతాలాపన జరిగే విధంగా పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు.  వనమహోత్సవం, విద్యార్థులకు గాంధీ సినిమా ప్రదర్శన, ఫ్రీడమ్ కప్ నిర్వాహణ, రక్తదాన శిబిరాలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలను బ్యాగస్వాములను చేసి విజయవంతం చేసేందుకు సన్నాహాలు పూర్తించేసుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి యన్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ పద్మజ రాణి అర్దిఒ రామచందర్ నాయక్  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post