“స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ” పై వి.సి. : సి.ఎస్. సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా

పత్రికా ప్రకటన    తేది:09.08.2022, వనపర్తి.
    రోజువారి ప్రణాళికల ప్రకారం “స్వతంత్ర భారత వజ్రోత్సవ” వేడుకలను నిర్వహించాలని, ప్రతి గ్రామంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలని, ఫ్రీడం రన్ క్రింద గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీల నిర్వహణ చేపట్టాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
    మంగళవారం హైదరాబాద్ నుండి “స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ” పై జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. వజ్రోత్సవ వేడుకలు నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు రోజువారి షెడ్యూల్ సిద్దం చేసుకొవాలని ఆయన సూచించారు.  ఆగస్టు 10న ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్క్ కింద కనీసం 75 మొక్కలు నాటాలని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 11న ఉదయం 6.30 నుంచి 8.00 గంటల వరకు ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్, ఆగస్టు 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్ నిర్వహణ, ఆగస్టు 13న  ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బెలూన్ లను గాల్లోకి వదలాలని ఆయన తెలిపారు. ఆగస్టు 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని, 119 బృందాలు సిద్దం చేసి సన్నద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని ఆయన సూచంచారు. ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని, జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 11,12 న గ్రామ స్థాయిలో, ఆగస్టు 13,14న మండల స్థాయిలో, ఆగస్టు 16,17న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 18న ఫ్రీడం కప్ చివరి పోటిలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని ఆయన వివరించారు. ఆగస్టు 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం, ఆసుపత్రి, అనాథ శరణాలయంలో స్వీట్, పండ్లు పంపిణీ జరగాలని, ఆగస్టు 20న రంగోలి పోటీలు, ఆగస్టు 21న గ్రామ పంచాయతీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు అందించాలని ఆయన ఆదేశించారు. వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.
    ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన, (రెవెన్యూ) డి వేణుగోపాల్, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, ఏ ఎస్ పి. షాకీర్ హుస్సేన్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, స్పోర్ట్స్ అధికారి రెహమాన్, డి ఎం హెచ్ ఓ రవిశంకర్, ఆర్టీవో, డి డబ్ల్యూ ఓ పుష్పలత, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని నుశిత, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, డీఎఫ్ఓ రామకృష్ణ, డి ఈ ఐ ఓ జాకీర్, సివిల్ సప్లై కొండల్ రావు, డి పి ఓ సురేష్, డీఈవో రవీందర్, ఐదు మున్సిపాలిటీల కమిషనర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, డి పి ఆర్ ఓ రషీద్,  వివిధ శాఖల జిల్లా  అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.
——————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post