స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -09:

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమంలో భాగంగా లో జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక పట్టణ కేంద్రంలోని వడ్డెరకాలనీ 24 డివిజన్ వార్డు లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఇంటింటా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈనెల 13 వ తేదీన దేశభక్తితో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతూ జాతీయ జెండాను, పి వి సి పైపును ప్రతి ఇంటికి కలెక్టర్ అందజేశారు.

జిల్లా వ్యాప్తంగా జెండా పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయని, గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ, మునిసిపాలిటీ ప్రాంతంలో వార్డ్ అధికారులచే పంపిణీ చేపడుతున్నట్లు, జెండా పంపిణీ సమయంలో నిబంధనలు పాటించాలని, బృందాల వారీగా ఇంటింటికి తిరిగి జెండాలను పివిసి పైపులు అందజేస్తారని, ఇచ్చిన జెండాలు ఎగురవేసే సమయంలో నిబంధనలు పాటించాలని, కాల్చడం, పారవేయడం చేయరాదని, వాహనాలపై కట్టకూడదని నిబంధనలు గుర్తు చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సన్యాసయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, వార్డ్ కౌన్సిలర్ మార్నేని వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, తహసిల్దార్ నాగ భవాని, డీఈ ఉపేందర్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post