స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి …..రాష్ట్ర గిరిజిన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి …..రాష్ట్ర గిరిజిన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -10:

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయి ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర గిరిజిన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

బుధవారం ఉదయం పట్టణ కేంద్రంలోని గాంధీ పార్క్ లో మంత్రి స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లతో కలిసి వజ్రోత్సవ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. పచ్చదనం విలసిల్లే పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు.

అనంతరం పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వార్డులోని ఇళ్లకు వెళ్లి జెండాలను అందజేశారు. వార్డులో మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు దశాబ్దాలుగా పోరాడి దేశ స్వాతంత్రం కోసం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వాతంత్ర్యం సాధించి పెట్టారని, మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే వారి త్యాగ ఫలితమేనని, త్రివర్ణ పతాకం భారతదేశానికి గర్వకారణమని అందుకే ప్రతీ భారతీయుడు జాతీయ జెండాను ఎంతో గర్వంగా 13 వ తేదీ నుండి15వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి ఇంటిపై పండుగ వాతావరణంలో ఎగర వేసుకోని దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మంత్రి అన్నారు.

గాంధీ పార్క్ అభివృద్ధి చేయనున్నట్లు, గాంధీ చరిత్ర మనకు ఎంతో ఆదర్శం అని, ఉదయం పిల్లలతో కలిసి గాంధీ మూవీని చూడ్డం జరిగిందని, అహింసా మార్గం తోనే ఉద్యమాన్ని నడిపారని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి, మహనీయుల ఆలోచనా విధానాలు భావజాలాలను నెమరు వేసుకోవాలని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే శంకర్ నాయక్ మాట్లాడారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల వజ్రోత్సవాలను నిర్వహించు కుంటున్నమని, స్వాతంత్ర్య సాధనలో స్వాతంత్ర్య సమరయోధులు, మన పూర్వీకులు పడ్డ కష్టం, వారి స్ఫూర్తి, వారి త్యాగాలను స్మరించుకోవాలి, మళ్ళీ అటువంటి విలువలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలో, పట్టనంలో, ఇంటిలో చర్చ జరగాలనీ, ఆ రోజు చేసుకున్న త్యాగాలను స్మరించుకోవాలి, ఆ అడుగుజాడలలో నడవాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు వారాలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈ జాతీయ జెండా ఇంటింటికి కూడా పంపిణీ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటిపై 13 నుండి 15 వరకు ఎగురవేయాలని తెలిపారు. 12 వరకు ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందనీ, ఈ నెల 11న ఉదయం నిర్వహించు ఫ్రీడమ్ రన్ లో ఎక్కువ మంది పాల్గొనాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ఆర్డిఓ కొమురయ్య మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహశీల్దార్ నాగభవాని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వార్డ్ కౌన్సిలర్ లు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

D

Share This Post