స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ:మంత్రి శ్రీ కే తారక రామారావు

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ

వీక్షకులను ఆకట్టుకున్న ఫైన్ ఆర్ట్స్ కళాశాల స్టాల్

– ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినిలను అభినందించిన మంత్రి శ్రీ కే తారక రామారావు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణలోనే మొట్ట మొదటి గిరిజన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ విద్యార్థిని లు కోర్స్ లలో భాగంగా రూపొందించిన వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.

ప్రిన్సిపల్ రజనీ అధ్వర్యంలో అధ్యాపక బృందం విద్యార్థినిలు ఇంటీరియల్‌డిజైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫొటోగ్రఫీ కోర్స్ లలో భాగంగా రూపొందించిన వాటిని సోమవారం
ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో ప్రత్యేకంగా ప్రదర్శిoచారు.

విద్యార్థులు సిద్ధం చేసిన ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వస్తువులు వీక్షకులను విశేషం గా కట్టుకున్నాయి.

ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రజనీ మార్గనిర్దేశనంలో విద్యార్థినిలు రూపొందించిన టేబుల్ క్యాలండర్, వాల్ క్యాలెండర్ ను కు మంత్రి శ్రీ కే తారక రామారావు ఆవిష్కరించారు.

అనంతరం టేబుల్ క్యాలండర్, వాల్ క్యాలెండర్ లను ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రజనీ కలెక్టరేట్ లో మంత్రి , జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ కి బహూకరించారు. క్యాలండర్ బాగుందంటూ ప్రిన్సిపల్, విద్యార్థుల ను మంత్రి అభినందించారు.

మిగతా ప్రభుత్వ శాఖల స్టాల్ లు, శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Share This Post