పత్రికా ప్రకటన తేది: 01-12-20 22
స్వయం ఉపాధి కొరకు బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పల్లూరు క్రాంతి బ్యాంకర్లను ఆదేశించారు.
గురువారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు బ్యాంకు మేనేజర్లతో వివిధ స్కీముల క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రుణాల చెల్లింపు పై సమీక్ష నిర్వహించారు. పీఎంఈజీపి, ముద్ర లోన్ల గురించి మాట్లాడుతూ ఏం బ్యాంకులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ,వాటిలో ఎన్ని పరిష్కరించారని , ఇంకా ఎన్ని పెందిద్న్గ్ ఉన్నాయని బ్యాంకర్లనుఅడిగి తెలుసు కున్నారు. .మీ మీ బ్యాంక్ లలో పెండింగ్ ఉన్న దరకాస్తులను పరిశీలించి రెండు వారాల లోపు పూర్తి చేసి లబ్ది దారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకర్లు చిన్నచిన్న పొరపాటులను చూపి దరకాస్తులను రిజెక్ట్ చేయరాదని, లబ్ది దారులకు వాటిపై అవగాహన కల్పించి వాటిని సరి చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారి దరకాస్తులను సవరణ చేసి మళ్లీ దరఖాస్తు పెట్టుకునెల చూడాలని ఆదేశించారు. తిరిగి చెల్లించే రుణాల గురించి వివరించాలని, ఇందుకు అవగాహన కల్పించాలని అన్నారు. అన్ని బ్యాంకులు ఎలాంటి పెండింగులు లేకుండా అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి రెండు వారాలలోపు అందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈసమావేశం లో జిల్లా అదనప కలెక్టర్ అపూర్వ చౌహాన్, చేనేత పరిశ్రమ అభివృద్ధి అధికారి గోవిందు, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రమేష్ బాబు, డి ఆర్ డి ఓ నాగేంద్రము, ఎల్ డి ఎం అయ్యప్ప రెడ్డి, బ్యాంకు మేనేజర్లు ,తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడింది.