స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ఏపీఎం లు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 7 ( మంగళవారం ).

స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ఏపీఎం లు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, డిఆర్డిఏ పిడి పురుషోత్తం, ఐకెపి డిపిఎం, ఏపీఎం లతో కలిసి పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డిఎ ఆధ్వర్యంలో నడపబడుతున్న మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల లక్ష్యం ఇప్పటి వరకు సాధించిన ప్రగతి రుణాల రికవరీ రేటు సంబంధిత విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగిస్తూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ యూనిట్ లక్ష్యం 188 కోట్లు గా ఉన్నదని ఇప్పటివరకు 54 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగిందని 100% లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అన్నారు. బ్యాంకు రుణాల రికవరీ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎక్కడైతే రికవరీ రేటు తక్కువ ఉన్నా పలివెల, కాటారం, మహాదేవపురం, మల్హర్ రావు మండలాల పై ప్రత్యేక దృష్టి సారించి బ్యాంకు రుణాల రికవరీ లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ దగ్గర అంబటిపల్లి, పాండవుల గుట్ట దగ్గర వినూత్నంగా మహిళా సంఘ సభ్యులతో టూరిస్టులకు కావలసిన వస్తువుల అమ్మకం షాపుల యూనిట్లు మంజూరు చేసి అమ్మకాల ద్వారా వారికి ఆదాయం చేకూర్చితే తద్వారా ఆర్థిక చేయూత నిచ్చినవారమవుతామని కలెక్టర్ అన్నారు. మహిళా సంఘాలకు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొత్త విధానాలతో కనీసం 1000 కుటుంబాలు బాగుపడేలా డైరీ ఫామ్, హోటల్, వెజిటేబుల్ యూనిట్లు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా ఎస్టీ మహిళలకు ఐటీడీఏ ద్వారా చిన్నతరహా పరిశ్రమలపై శిక్షణ ఇచ్చేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. ప్రధానమంత్రి మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా రైతులకు ట్రాక్టర్ పరికరాలు అద్దెకు ఇచ్చుట, కస్టమర్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నివేదిక తయారు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి పురుషోత్తం ఎడిషనల్ డిఆర్డిఓ సురేష్, డీపీఎం రవి, అన్ని మండలాల ఏపిఎంలు పాల్గొన్నారు

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post