స్వరాష్ట్రంలో అన్ని మతాలకు సమాన గౌరవం దక్కింది :: రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీాణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ అక్టోబర్ 28; స్వరాష్ట్ర0లో అన్ని మతాలకు సమాన గౌరవం దక్కిందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీాణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గురువారం పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మి నరింహస్వామి ఆలయంలో దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం సుమారు 15 లక్షల 35 వేల రూపాయలతో ఆలయ ముఖద్వారం, వరుస లైన్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర0లో అన్ని మతాలకు సమాన గౌరవం దక్కిందనీ అందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆలయాల ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరాలయం, బమ్మెర పోతన ప్రాజెక్ట్, వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తదితర ప్రదేశాలు అద్భుత0గా తయారు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాత రెగమాటి రాంరెడ్డి, ఏసిపి గొల్ల రమేశ్, పాలకుర్తి సోమేశ్వరాలయ ఈఓ బి.లక్ష్మీ ప్రసన్న, పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జనగామచే జారీ చేయనైనది.

Share This Post