స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి, సంస్కృతిని స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 75 వారాల పాటు ఆజాది కా అమ్రిత్ మహోత్సావ్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి, సంస్కృతిని స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 75 వారాల పాటు ఆజాది కా అమ్రిత్ మహోత్సావ్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి, సంస్కృతిని స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 75 వారాల పాటు ఆజాది కా అమ్రిత్ మహోత్సావ్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశం అన్నింటా ఉత్తమంగా ఉండాలని కలలు కనీ 2.0 వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నదని, అట్టి విజయాలు, దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా 2023 ఆగస్ట్ 15 వరకు అమ్రిత్ మహోత్సవాల పెరట కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నా ఇంతవరకు చరిత్రకెక్కని స్వాత్రంత్య సమరయోధుల గాధలు, సంఘటనలు, ప్రాంతాలు, జానపదులను వెలుగులోకి తెచ్చి నేటి తరానికి తెలిసేలా చేయాలని కేంద్ర సాంస్కృతిక విభాగం సంకల్పించిదని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతి జిల్లాలో మరుగునపడిన, వెలుగు చూడని యోధులు, వ్యక్తుల జీవితాలు, వారి జీవితంలో జరిగిన సంఘటనలు, ప్రాంతాలు, జానపదులు, సంస్కృతి, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి జిల్లాల వారిగా డిజిటల్ రిపోజిటరి రూపొందిస్తున్నదని ప్రతిమ సింగ్ తెలిపారు.
మన మెదక్ జిల్లాలో కూడా చాలా గ్రామాలలో చారిత్రాత్మకమైన విషయాలు జరిగి ఉండవచ్చని, కాని అది చారిత్రాత్మకమైనదని తెలియక మరుగున పడి వెలుగు చూడక ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సావ్ లో భాగంగా, ఇప్పుడైనా చరిత్ర పుటలకేక్కని సంఘటనలు, ఆనాటి నాయకులు చూపిన తెగువ, ధైర్యం, విజయాలను వెలుగులోకి తెచ్చి ముందు తరాలకు తెలియజేయవలసిన భాద్యత మనపై ఉందన్నారు. ప్రధానంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన యోధులపై దృష్టి పెట్టాలని, లేనిచో స్వాతంత్య్ర సంగ్రామంలో వారి భాగస్వామ్యం గుర్తింపుకు నోచుకోదని ఆమె పేర్కొన్నారు.
గ్రామాలలో తాత, అవ్వలు, పెద్ద మనుషులను కలిస్తే చరిత్రకెక్కని, మరుగునపడిన స్వాతంత్య్ర సమర యోధులు, వ్యక్తులు, సంఘటనల వివరాలు తెలిసే అవకాశముందని, వారికి దేశ చరిత్ర, సంస్కృతి , ఔన్నత్యం గురించి వివరిస్తే సమాచారం వచ్చే అవకాశమున్నదని అన్నారు. ఇట్టి సమాచారాన్ని సేకరించడంలో గ్రామా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రదినిధులు వ్యక్తిగత చొరవ తీసుకొని క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.
అదేవిధంగా స్వాతంత్య్ర సంగ్రామంలో జిల్లా నుండి పాల్గొని చరిత్రపుటల్లో వెలుగు చూడని సమరయోధుల వివరాలు, సంఘటనలు, ప్రాంతాలు ఎవరికైనా తెలిసినట్లైతే అట్టి సమాచారాన్ని, సంఘటనకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 30 లోగా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కి నేరుగా గాని వాట్స్ అప్ నెంబర్ 91541 70928 ద్వారా గని అందజేయవలసిందిగా ఆమె ప్రజలను కోరారు. సేకరించిన ఇట్టి సమాచారాన్ని మరోమారు నిర్దారించుకొని నివేదిక రూపంలో క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, తద్వార వారి జీవితగాధలు, సంఘటనలను వెలుగులోకి వచ్చి భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని, వారికిదే నిజమైన ఘన నివాలని అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.

Share This Post