స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి-అదనపు కలెక్టర్ తిరుపతి రావు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హలులో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావలసి ఉన్నాయని, అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. వేడుకలకు వచ్చే అతిథికి పొలిసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పొలిసు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. మైదానంలో వాటరింగ్ చేయాలని, వేదికను అందంగా అలంకరించాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. స్టాల్ల్స్ , శకటాలను ఏర్పాటు చేయవలసి వస్తే అందుకు వ్యవసాయ, ఉద్యాన, డిఆర్డివో , జిల్లా శిశు సంక్షేమాధికారి, వైద్య, ఆరోగ్య, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Share This Post