స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 12:–
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావలసి ఉన్నాయని, గతంలో మాదిరిగానే ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించనున్నామన్నారు. ఆ మేరకు డయాస్, బ్యారికేడింగ్ ఏర్పాట్లూ, అతిథికి పొలిసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పొలిసు బందోబస్త్ ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని, మైదానంలో వాటరింగ్ చేయాలని మునిసిపల్ కమీషనర్కు సూచించారు. డయాస్ ను అందంగా అలంకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్య అతిథికి జిల్లాలో జరుగుచున్న అభివృద్ధి పనులపై ప్రసంగం రూపొందించవలసినదిగా డిపిఆర్ ఓ కు సూచించారు.

అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. స్టాల్ల్స్ ఏర్పాటు చేయడానికి ఆయా సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post