స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశ చరిత్రలో ఓ అద్భుత ఘట్టమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

మంగళవారం వజ్రోత్సవాల నేపథ్యంలో
జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. స‌రిగ్గా ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌మ‌ణ గీతాన్ని ఆల‌పించారు.

కొత్త చెరువు బండ్ పై మున్సిపల్, పోలీస్ శాఖ సహకారంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ రాహుల్ హెగ్డే , మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.
స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన పోరాటయోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే సీఎం శ్రీ కేసీఆర్ ఈ నెల 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబురాలకు రూపకల్పన చేశారన్నారు.

వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, వార్డులు, జంక్షన్ లు, అన్ని ఇన్స్టిట్యూషన్ లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించామన్నారు.

జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ…
జిల్లాలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో అందరూ ఉత్సహంగా పాల్గొంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం
ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. జాతీయ గీతం, పతాకం సహా జాతీయ చిహ్నాలను గౌరవించుకుంటూ
వజ్రోత్సవ వేళ భారత దేశాన్ని గొప్ప దేశంగా ముందుకూ తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని అన్నారు.

మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, Ao బి గంగయ్య, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు.
వారిని స్మరించుకుంటూ మహనీయుల బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని కోరారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది.
కలెక్టరేట్ లో జాతీయ గీతాలాపన అనంతరం జాతీయ జెండాలను చేతబూని న ఉద్యోగులు దేశభక్తి పూరిత నినాదాలు చేశారు.

——————————

 

Share This Post