స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా జరుపుకుంటున్న ఆజాది కా అమృత్ మహోత్సవాలలో భాగంగా నవంబర్ 26 న 72వ భారత రాజ్యంగా దినోత్సవం సందర్బంగా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, పాల్గొన్నారు.

“భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి , పౌరులందరికి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయన్ని , ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని, చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి , 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపికచేసికొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం.” అని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమం లో డి.పి.ఆర్.ఓ చెన్నమ్మ, పంచాయతి రాజ్ ఈ ఈ సమత,  ఏ ఓ  ఎల్లయ్య ఎం ఆర్ ఓ రాజు, మదన్ మోహన్,  వేణుగోపాల్ రెడ్డి, తేజ. షఫీ  ,కార్యాలయ  సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

Share This Post