స్వాతంత్ర్యానంతరం భారతదేశాన్ని సమైక్య పరిచి ఎన్నో సంస్థానాలను విలీనం చేసిన స్పూర్తి ప్రదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.

ప్రెస్ రిలీజ్.
తేది.31.10.2021.
హనుమకొండ.

స్వాతంత్ర్యానంతరం భారతదేశాన్ని సమైక్య పరిచి ఎన్నో సంస్థానాలను విలీనం చేసిన స్పూర్తి ప్రదాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున జాతీయ ఏక్తా దివస్ నిర్వహించుకుంటున్న సంగతి విదితమే.

ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి వేడుకలను నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాంచినరని అన్నారు. ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకోవడము సంతోషంగా ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నారు.
భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని, భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ, నెహ్రూ తోటి స్వాతంత్ర్యం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించారని, వీరి ఆలోచనలు, ఆచరణలు భావితరాలకును ముందుకు తీసుకు వెళ్లడానికి దిక్సూచిగా ఉపయోగపడుతున్నాయని, పటేల్ ఆశయాలు మనకు ఆచరణీయమని, భారత సమాజానికి ఎంతో ఉపకరించేవని పేర్కొన్నారు. మనము ఉద్యోగ ధర్మంలో సమాజానికి మన వంతు సేవ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వారితో
దేశ ఐక్యమత్యం పై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ నారాయణరెడ్డి, జీఎం ఇండస్ట్రీస్ హరిప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారిణి భారతి, డిపిఆర్ ఓ లక్ష్మణ్ కుమార్, కలెక్టరేట్ ఏ ఓ కిరణ్ ప్రకాష్, సూపర్డెంట్లు విజయ లక్ష్మి, రుక్మిణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post