స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -06:

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శనివారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పంద్రాగస్టు సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, స్టేజ్ ఎత్తు లేకుండా సరిగా ఏర్పాటు చేయలని, శకటాలు ప్రదర్శన, వి. ఐ.పిలు, అతిథులు సౌకర్యవంతంగా కూర్చొనేలా ఏర్పాట్లు చేయాలని, వాటర్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలని, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమాలు నిర్వహణ సందర్భంగా కార్పెట్ వేయాలని, పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరం మేరకే బారికేడ్లను ఏర్పాటు చేయాలని, తహసిల్దార్ స్థాయి అధికారిని ప్రోటోకాల్ పాటించేలా వి. ఐ.పి. గలరీలో ఉంచాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఫోటోలు, వీడియోలు తీసుకునే విధంగా సౌకర్యంగా ఉండేలా స్టేజ్ కు ఎదురుగా ఏర్పాట్లు చేయాలని, వివిధ శాఖలకు స్టాల్ లను ఏర్పాటు చేయాలని, ఈ సారి ఇంటింటా ఇన్నోవేటర్ కు స్టాల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలు, జంక్షన్ లను విద్యుత్ దీపాలతో అలంకరించెలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకట రమణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు పుల్లా రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post