స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం .కలెక్టర్ హరీష్

స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం .కలెక్టర్ హరీష్

అందరు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రద్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావలసి ఉన్నాయని, అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ సారి కూడా కలెక్టరేట్ ఆవరణలోనే వేడుకలు నిర్వహించనున్నామని అందుకనుగుణంగా డయాస్, బ్యారికేడింగ్ ఏర్పాటు తో పాటు కలెక్టరేట్ లోపల, వెలుపలికి వెళ్లే దారిని లెవెలింగ్ చేయవలసినదిగా ఆర్ అండ్ బి ఈఈ శ్యామ్ సుందర్ కు సూచించారు. వేడుకలకు వచ్చే అతిథికి పొలిసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పొలిసు బందోబస్త్ ఏర్పాట్లు చూడవలసినదిగా డిఎస్పీ కృష్ణమూర్తి కి సూచించారు. ఆ రోజు పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని, మైదానంలో వాటరింగ్ చేయాలని మునిసిపల్ కమీషనర్ శ్రీహరికి సూచించారు. పలు రంగుల పూలతో డయాస్ ను అందంగా అలంకరించాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు నర్సయ్య కు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ ఎస్.ఈ. జానకి రామ్ కు సూచించారు. ముఖ్య అతిథికి జిల్లాలో జరుగుచున్న అభివృద్ధి పనులపై ప్రసంగం రూపొందించవలసినదిగా ముఖ్య ప్రణాళిఖాధికారిని, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటయు చేయవలసినదిగా డిపిఆర్ ఓ కు సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం అతిధులను ఆహ్వానించాలని , ఇన్విటేషన్ కార్డు రూపొందించాలని, ఓవరాల్ గా అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా, వేడుకలు విజయవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించవలసినదిగా ఆర్.డి.ఓ. సాయిరాం , ఏ.డి. మైన్స్ జయరాజ్ లకు కలెక్టర్ సూచించారు. స్టాల్ల్స్ ఏర్పాటు చేయవలసి వస్తే అందుకు వ్యవసాయ,ఉద్యాన, డిఆర్ డివో , జిల్లా శిశు సంక్షేమాధికారి, వైద్య, ఆరోగ్య, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఐదు కు మించకుండా చేసి సిద్ధంగా ఉంచుకోవలసినదిగా డి.ఈ ఓ రమేష్ కుమార్ , జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి లకు సూచించారు. విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇచ్చుటకు అన్ని శాఖల అధికారుల నుండి వివరాలు తెప్పించుకొని సిద్ధంగా ఉండవలసినదిగా కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ కు సూచించారు.

Share This Post