స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

పత్రికా ప్రకటన.   తేది:11.08.2022, వనపర్తి.

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ఆదేశించారు.
గురువారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన ఉదయం గం.10.30 ని.లకు పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా శాఖల అధికారులకు విధులు కేటాయించినట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, స్టాల్స్ లో సంక్షేమ పథకాలపై జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లా ప్రగతిని వివరించే సందేశంను రూపొందించేందుకు సిపిఓ, డిపిఆర్ఓ లకు, మున్సిపాలిటీ శాఖ పరిశుభ్రత పాటించేలా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సాంస్కృతిక శాఖ ఏర్పాట్లను విద్యాశాఖ చేపట్టాలని, ప్రశంసా పత్రాలను పంపిణీ చేసేందుకు శాఖల వారీగా ఉద్యోగులను ఎంపిక చేస్తూ పేర్లను ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశించారు. డి ఆర్ డి ఓ ఆయా సంఘాలు, ప్రజలు హాజరయ్యేలా చూడాలని, ఆర్ అండ్ బి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. డి పి ఆర్ ఓ, ఆర్ అండ్ బి, అటవీశాఖ, మున్సిపల్ శాఖ, డి ఆర్ డి ఎ, సివిల్ సప్లై శాఖలకు నిధులను కేటాయించినట్లు ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈ.ఈ. దేశ్యా నాయక్, డి ఆర్ డి ఓ నరసింహులు, సి పి ఓ వెంకటరమణ, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post