స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.

                                                                                                                                                                                     స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల చిత్రపటాలకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు మహనీయుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రజలే పాలకులుగా రాజ్యాంగబద్ధంగా  గణతంత్ర రాజ్యంగా ఏర్పడ్డ రోజని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ప్రజలు ఎప్పటికీ గుర్తించుకొని ఆ స్ఫూర్తితో  దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన విధంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి చేరేలా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో  జిల్లాలోని 70 శాఖల అధికారులతో కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని నాలుగున్నర లక్షల ప్రజలు సమాజ మరియు దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కరోనా వైరస్  నేపథ్యంలో జిల్లాలోని   ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆజాదిక అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా  జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైన పలిమెల మండలం దమ్మూరు, చిట్యాల  పండలం నైన్ పాక, కాటారం మండలం చింతకాని  గ్రామపంచాయతీలకు 50 వేల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రాలను ఆయా గ్రామ పంచాయతీల సర్పంచూలు, పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఆజాదిక అమృతోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన మరియు వకృత్వ పోటీల్లో మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు 1 ప్రైజ్  ఆర్.స్వాతి జడ్.పి.హెచ్.ఎస్ భూపాలపల్లి, 2 ప్రైజ్ ఏ.దుర్గేష్ జడ్.పి.హెచ్.ఎస్ (బాలుర) మహాదేవపూర్, 3 ప్రైజ్ ఏ.అఖిల జడ్.పి.హెచ్.ఎస్ జూకల్ లకు ప్రశంసాపత్రాలను జిల్లా కలెక్టర్ మరియు అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ సంపత్ రావు, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, జెడ్పీ సీఈవో శోభారాణి, డిపిఓ ఆశాలత, డిఆర్డిఓ పురుషోత్తం, సిపిఓ శామ్యూల్, డిపిఆర్ఓ బి.రవికుమార్, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఇడి ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, డిబిసిడిఓ శైలజ, డిఎస్సిడిఓ సునీత, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, డిఎం సివిల్ సప్లై రాఘవేందర్,  కలెక్టరేట్ సిబ్బంది, మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post