స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కోవిద్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.

Press release. 12.8.2021

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కోవిద్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.

గురువారం నాడు కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఆగస్టు, 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్ఫుటించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పరిమితంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని, ఉద్యోగుల ఎంపిక సరిగా చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే స్థల నిర్దేశము రేపటిలోగా జరుగుతుందని తెలిపారు.

సమీక్షా కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌, జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ డి. వేంకట మాధవరావు, ఆర్డీవో ఎస్. శీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

…DPRO. KMR.

Share This Post