స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అధికారులను ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                  తేది: 13-08-2021

        స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా  అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే  పరేడ్ గ్రౌండ్ ను అదనపు కలెక్టర్, ఆర్ డి ఓ , డి ఎస్ పి లతో కలిసి   పరిశీలించారు. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పతాకావిష్కరణ గావించేందుకు  జిల్లా కు ముఖ్యఅతిథి గా ప్రభుత్వ విప్ కుచకుళ్ళ  దామోదర్ రెడ్డి  గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రోటో కాల్ ప్రకారం  సీట్ అరేంజ్మెంట్స్ , డయాస్, బారికేడ్లు, తాగునీరు వాహనాల పార్కింగ్, తదితర సౌకర్యాలు సత్వరం పూర్తిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు దరించి బౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలనీ, ముఖ్యఅతిథి సమక్షంలో పెరేడ్ గ్రౌండ్ లో  నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ అధికారులకు  ఆదేశించారు .కోవిడ్ నిబంధనల ప్రకారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అన్నారు.

 ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ,  ఆర్డీవో రాములు, డి ఎస్ పిసత్యనారాయణ  , అండ్ బి  ఇ ఇ  ప్రగతి, డిపి ఆర్ ఓ చెన్నమ్మ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,  ఏ ఓ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

———————————————————————————-

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post