స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని

75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఆదివారం నాడు సమీకృత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివ్రుది, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలిసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితమే మనమీనాడు స్వేచ్చా వాయువులు పీలున్తున్నామని, ఆ మహానుబావుల త్యాగాలను మననం చేసుకొని వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని అభివ్రుది పదంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుచున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అణగారిన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పధకాలను అమలుపరుస్తూ దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. అందులో భాగంగా అట్టడుగు వర్గాలను ఆర్థికపరంగా అభివ్రుది చేసి సమాజంలో గౌరవ స్థానం కల్పించాలన్న ఉద్దేశ్యంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పధకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పధకాన్ని దశల వారీగా చేపట్టి నిరుపేదలైన ప్రతి దళిత కుటుంబానికి ఏ విధమైన బ్యాంకు గ్యారంటి లేకుండా 10 లక్షల రూపాయలు అందజేయనుందని అన్నారు. ఒకవేళ అనుకోకుండా లబ్ధిదారుని కుటుంబానికి ఏదైనా జరిగితే ఆదుకోవడానికి రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నామని, అయితే 10 లక్షలు పొందిన లబ్దిదారుడు అందులోనుండి 10 వేల రూపాయలు అందజేస్తే అంతే మొత్తం ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ఈ నిధికి అందిస్తుందని అన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా దళితవాడలు, గిరిజన ఆవాస ప్రాంతాలలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో 25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న వారికి ఋణ మాఫీ చేయగా రేపటి నుండి 50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఋణ మాపీ చేస్తున్నామని దశలవారిగా లక్ష రూపాయల లోపు ఋణ మాఫీ చేయనున్నామని అన్నారు. జిలాలో అర్హులైన 3,368 మంది లభ్దిదారులకు ఆహార భద్రతా కార్డులు అందజేసి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తున్నామన్నారు. జిలాలో ఒక లక్ష 4 వేల 105 మందికి ప్రతి నెల పెన్షన్లు అందజేస్తున్నామని, ప్రభుత్వం ఇటీవల 57 సంవత్సరాలు నిండిన నిరుపేదలకు ఆసరా పెన్షన్లు అందించాలని నిర్ణయించిందని, అర్హులైన వారు ఈ నెలాఖరులోగా మీ సేవ, ఈ- సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవలసిందిగా ఆయన సూచించారు. గొల్ల కురుమ యాదవుల అభివృధికి రెండో విడతగా జిల్లాలో 7,810 మంది లబ్దిదారులకు కు యూనిట్ కు లక్ష డెబ్బై ఐదు వేల విలువగల గొర్రెలను 75 శాతం సబ్సిడిపై అందజేయనున్నామన్నారు. గత మాసంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో పాటు హరితా హారం కార్యక్రమం చేపట్టి పారిశుద్యం, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టామని తద్వారా గ్రామాల రూపురేఖలే మారుతున్నయన్నారు. పల్లెల అభివృధికి గాను గ్రామా పంచాయితీలకు నేరుగా 26 కోట్లు అందజేశామని, మునిసిపల్ పట్టణ ప్రాంతాల అభివ్రుదికి, సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హరిత హారం క్రింద జిల్లాలో 31 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. యాసంగిలో 88 వేల 206 మంది రైతులనుండి 4 లక్షల 42 వేల 2346 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 835 కోట్ల రూపాయిలు చెల్లించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచామన్నారు. ఈ వానాకాలంలో రైతు బంధు క్రింద 2 లక్షల 35 వేల మంది రైతులకు 197 కోట్ల 74 లక్షలు అందించామని, 2,12,529 ఎకరాలలో వరిసాగు చేస్తున్నారని తద్వారా 4 లక్షల 64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందన్నారు. రైతులకు సాగు నీరందించుటకు మిషన్ కాకతీయ క్రింద ఘనాపూర్ ఆనకట్ట పెంచుటకు 43 కోట్ల 64 లక్షల వ్యయంతో పనులు చేపట్ట్టమని పనులు ప్రగతిలో ఉన్నాయని తద్వారా వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని అన్నారు.
సమీకృత మత్య్స అభివ్రుది పధకం క్రింద జిల్లాలోని 1,211 చెరువులలో 2 కోట్ల 52 లక్షల విలువ గల 34 కోట్ల 15 లక్షల చేప పిల్లను విడుదల చేయడం జరిగిందని తద్వారా 8 వేల 500 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశముందన్నారు. అదీవిధంగా 1,189 పాడి పశువులను సబ్సిడిపై ఇవ్వడంతో పాటు, 3 క్వింటాళ్ళ దాణా ఉచితంగా అందించడం జరిగిందని మంత్రి వివరించారు.
జిల్లాలో స్త్రీ నిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయాక బృందాలకు ఇప్పటి వరకు 8 కోట్ల 50 లక్షల రుణాలు, బ్యాంకు లింకేజి ద్వారా 1,786 సంఘాలకు 70 కోట్ల 62 లక్షలు రుణాలుగా అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. గత సంవత్సరం కల్యానలక్ష్మి, షాదిముబరాక్ క్రింద 5,,584 మంది లబ్దిదారులకు ఒక లక్ష 116 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం చేశామన్నారు. ఎస్సి సేవా సహాకార అభివ్రుది సంస్థ ద్వారా 219 మంది లబ్దిదారులు స్వయం ఉపాధి పధకాలు చేపట్టుటకు 8 కోట్ల 54 లక్షలు అందించనున్నామన్నారు. ఎస్సి కులాల అభివ్రుది శాఖా ద్వారా 101 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన 17,794 మంది లబ్దిదారులకు 19 లక్షల 25 లక్షలు అందించామని మంత్రి తెలిపారు. బి.సి. సంక్షేమ శాఖా ద్వారా రజక, నాయి బ్ర్తహ్మనులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నామని మంత్రి వెల్లడించారు.
కరోనా కట్టడిలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 21 వేల 446 మందికి కోవిడ్ టీకాలు వేశామని, సీసీజనల్ వ్యాధులు ప్రభలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాతా శిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా 20,7777 మందికి కే.సి.ఆర్. కిట్లు అందించామని మంత్రి వివరించారు. మిషన్ భగీరథ క్రింద 631 ఓవర్ హెడ్ ట్యాంక్ లు నిర్మించి 1,89,680 గృహాలకు నల్లాలు బిగించి నీటి సరఫరాచేస్తున్నామని మంత్రి వివరించారు. జిల్లాలో కొత్తగా ౩౩/11 కే.వి. విద్యుత్ సబ్ స్టేషన్లు 17 మంజూరు కాగా 8 పూర్ల్తయ్యయని, మిగతా సబ్ స్టేషన్ ల నిర్మాణం ప్రగతిలో ఉన్నాయని అన్నారు. భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా చేపట్టుటకు చేపట్టిన ధరణి లో ఇప్పటి వరకు వచ్చిన దస్తా వేజులు, గిఫ్ట్ డీడ్స్, నిషేదిత భూముల మార్పులు, భూ సమస్యలకు సంబంధించి వచ్చిన 36,832 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. జిల్లాకు 5,244 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కాగ ఇప్పటి వరకు 142 కోట్ల 42 లక్షల వ్యయం చేసి 1,917 ఇండ్లు పూర్తి చేసామని, మరో 1,550 ఇండ్ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ టి.ఎస్. ఐ పాస్. క్రింద పలు రాయితీలు ఇస్తున్నదని తద్వారా పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఈ పధకం క్రింద జిల్లాలో 525 యూనిట్లు నెలకొల్పుటకు యువత దరఖాస్తు చేసుకోగా వివిధ విభాగాల నుండి అనుమతులు ఇచ్చామన్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి ఉపాధి హామీ పధకం క్రింద 26 యూనిట్లకు ఆర్ధిక సహాయం అందించుటకు సిఫారసు చేశామన్నారు. వీధి విక్రయదారులకు 10 వేల రూపాయల చోపున ఆర్ధిక సహాయం అందించుటకు 5,444 మంది లభిదారులను గుర్తించి ఇప్పటి వరకు 3,479 మందికి బ్యాంకు రుణాలు అందించామన్నారు. చివరగా జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల పాత్ర మరువలేనిదని అన్నారు. జిల్లాను ప్రగతి పదంలో పయనించేలా ప్రతి ఒక్కరు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.ఈ సందర్భంగా 27,002 మంది రైతులకు 91 కోట్ల 91 లక్షల రుణా మాఫీకి సంబంధించిన చెక్కును కలెక్టర్ కు అందజేశారు. అదేవిధంగా 601 మహిళా సమాఖ్యలకు 26 కోట్ల 44 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
అనంతరం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాటశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలను తిలకించి విద్యార్థిని విద్యార్థుల ను ప్రశంసిస్తూ జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు అందజేశారు. ఆ తరువాత డి.,ఆర్.డి.ఓ. ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను, మహిళా శుశు సంక్షేమం, చైల్డ్ హెల్ప్ లైన్, ఉద్యాన, వ్యవసాయ, మిషన్ భగీరథ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ల్స్ ను తిలకించారు. ఇంటింటా ఇన్నోవేటర్ లో భాగంగా జిల్లా నుండి ఎంపికైన మూడు ఆవిష్కారణల స్టాల్ ను సందర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి శాలువాతో సన్మానించారు.
ఆ తరువాత ఉద్యోగ నిర్వహణలో విశేష కృషి చేసిన 134 మంది అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరిలో… డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి.ఓ. తరుణ్, మైన్స్ ఏ.డి. జయ రాజ్,. ఎస్సి కార్పోరేషన్ ఈ.డి. దేవయ్య, డి.ఏం. అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్ రావు, మెప్మా నుండి సునీత వంటి జిల్లా అధికారులతో పాటు 12 మంది రెవిన్యూ, 18 మంది పొలిసు, 5 మంది అటవీ, 12 మంది వైద్య ఆరోగ్య శాఖా, 13 మంది మునిసిపాలిటి, 9 మంది జిల్లా పంచాయతి విభాగం, 5 గురు డి.ఆర్.డి.ఏ, స౫6 గురు సెర్ఫ్, ముగ్గురు మహిళా శిశు సంక్షేమం, 10 మంది వైద్య విధాన పరిషద్ నుండి ఉతమ సేవలందించిన ఉద్యోగులకు పెరశంసా పత్రాలు అందజేసారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, ఉద్యాన వనం, విద్య, నీటిపారుదల, జైల్స్, చీఫ్ ప్లానింగ్, ఎస్సి డెవలప్మెంట్, ఫైర్ సర్విస్, రవాణ, ,ఎన్.ఐ.సి. పశు సంవర్ధక శాఖల నుండి ఇద్దరేసి చొప్పున ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగేర్ బి.సి. అభివ్రుది, సహాకార శాఖా, పరిశ్రమలు, లీడ్ బ్యాంకు, మైనారిటీస్, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమం, యువజన క్రీడలు, ఆరోగ్య శ్రీ, విద్యా శాఖా నుండి ఒక్కొకరు చొప్పున విశిష్ట సేవలండిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్, జిల్లా ఎస్పీ చందన దీప్తి, అదనపు కల్లెక్టర్లు ఎ.రమేష్, ప్రతిమ సింగ్, ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్, శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్,జెడ్.పి . వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, జిల్లా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post