స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు :: వి.పి గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 1:

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు బృందాలను సిద్ధం చేయాలన్నారు. నిర్వహణకు కమిటీ ఏర్పాటుచేసి, ఆగస్టు 10 కల్లా జాబితా సమర్పించాలన్నారు. అధికారులకు ఉత్తమ సేవాపురస్కారాల విషయంలో ఉత్తమ సేవలు, పారామిటర్స్ లో సాధించిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. శాఖల శకటాలు, స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వివిధ శాఖల పథకాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్ పెద్ద ఎత్తున చేసేలా కార్యాచరణ చేయాలని,జాబితా ఆగస్టు 10 లోగా సమర్పించాలని ఆయన అన్నారు. లకారం లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అతిథులకు ముందస్తుగా ఆహ్వానాలు ఆందాలని, ఆహ్వానపత్రికను రూపొందించాలని ఆయన తెలిపారు. జిల్లాలో పండుగ వాతావరణం స్పూరించాలని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Share This Post